పరువునష్టం కేసులో తనకు రెండేళ్ల శిక్ష విధించడాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సవాల్ చేయనున్నారు. దీనికోసం నేడు సూరత్ లోని సెషన్స్ కోర్టులో అప్పీలు దాఖలు చేయనున్నారు. తనపై ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును పక్కన పెట్టాలని, సెషన్స్ కోర్టు తీర్పు ఇచ్చే వరకు ట్రయల్ కోర్టు తీర్పుపై స్టే విధించాలని రాహుల్ విజ్ఞప్తి చేయనున్నారు. నేడు మధ్యాహ్నం 3 గంటలకు రాహుల్ సెషన్స్ కోర్టుకు చేరుకోనున్నారు.