దేశంలో వరుస భూకంపాలతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా అస్సాం లోని గౌహతిలో భూమి కంపించింది. గౌహతికి 58 కి.మీ దూరంలో భూమి కంపించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.6గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. అకస్మాత్తుగా భూమి కంపించడంతో ప్రజలు ఇళ్లలోంచి బయటకు పరుగులు పెట్టారు.