ఆటో అదుపుతప్పి స్తంభాన్ని ఢీకొట్టిన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. అహ్మద్ నగర్ లో ఓ ట్రాలీ ఆటో వేగంగా వెళ్తూ అదుపుతప్పి స్తంభాన్ని ఢీకొట్టింది. ప్రమాద సమయంలో ఆటో వేగంగా ఉండడంతో గాల్లోనే రెండు పల్టీలు కొట్టింది. దీంతో ఆటోలో ఉన్నవారు గాల్లోకి ఎగిరి దూరంగా పడ్డారు. ఈ ప్రమాదంలో ముగ్గురికి గాయాలైనట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.