జార్ఖండ్‌లోని ఛత్రా జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. మృతిచెందిన మావోయిస్టుల్లో ఇద్దరిపై రూ. 25 లక్షల చొప్పున, మరో ఇద్దరిపై రూ. 5 లక్షల చొప్పున రివార్డు ఉన్నట్టుగా పోలీసులు తెలిపారు. ఘటనా స్థలంలో రెండు ఏకే 47లను స్వాధీనం చేసుకున్నారు. మృతుల్లో మావోయిస్టు అగ్రనేతలు ఉన్నట్టుగా పోలీసులు చెబుతున్నారు. ఆపరేషన్ ఇంకా కొనసాగుతుందని వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa