మోదీ ఇంటి పేరుపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి దాఖలైన క్రిమినల్ పరువు నష్టం దావాలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సూరత్ ట్రయల్ కోర్టు రెండేళ్ల జైలుశిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దిగువ కోర్టు నిర్ణయాన్ని రాహుల్ గాంధీ సూరత్ సెషన్స్ కోర్టులో సవాలు చేశారు. దీనిపై రాహుల్ తరపు న్యాయవాది సోమవారం అప్పీల్ దాఖలు చేశారు. దీంతో రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు ఏప్రిల్ 13 వరకు బెయిల్ పొడిగించింది.