దేశవ్యాప్తంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) ఆన్ లైన్ సేవలు నిలిచిపోయాయి. దీంతో ఎస్బీఐ వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎస్బీఐ యూపీఐ, యోనో, యోనో లైట్, నెట్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్లు చేస్తుంటే ఫెయిల్ అవుతున్నాయని చాలామంది వినియోగదారులు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. దీనిపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పందించాల్సి ఉంది.