ఏపీలో ముందస్తు ఎన్నికలపై సీఎం జగన్ ఓ క్లారిటీ ఇచ్చారు. తాడేపల్లిలో వైసీపీ ఎమ్మెల్యేలు, ఇన్చార్జిలు, సమన్వయకర్తలతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సంవత్సరంలో ఎన్నికలకు వెళుతున్నామని, షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని తేల్చిచెప్పారు. అలాగే మంత్రివర్గ మార్పులపై పుకార్లను నమ్మవద్దని, ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోందని పేర్కొన్నారు.