సమాజంలోని ప్రముఖులను కూడా దొంగ కేసులతో వేధిస్తున్నారని వైసీపీ ప్రభుత్వవంపై టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య విమర్శించారు. పద్మవిభూషణ్ అవార్డు గ్రహీతలను సైతం తప్పుడు కేసులతో అప్రదిష్ఠ పాల్జేస్తున్నారని తెలిపారు. బ్రహ్మయ్య అండ్ కో సంస్థ ఎలాంటి చెడ్డపేరు లేకుండా తొమ్మిదేళ్లుగా ఆడిటింగ్ చేస్తుంటే, ఆ సంస్థకు చెందిన శ్రావణ్ పై తప్పుడు కేసులు బనాయించారని వర్ల రామయ్య ఆరోపించారు. మళ్లీ అధికారంలోకి రాలేమన్న అసహనం జగన్ లో కనిపిస్తోందని అన్నారు. ఆఖరికి వృత్తి నిపుణులపైనా ఈ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని అన్నారు. తెలుగుజాతి గర్వించే ప్రముఖులను వేధింపులకు గురిచేయడం సరికాదని వర్ల రామయ్య హితవు పలికారు.