గుంటూరు: ఏటీ అగ్రహారంలో నివసించే ఓ మహిళ బ్రాడీపేట లోని ఓ అపార్ట్మెంట్లో ఇంటి పనులు చేసుకుంటుంది. ఆమె ఇంటికి వెళ్తున్న సమయంలో వేల్పుల రమేష్ వెంటపడి వేదించేవాడు. గత నెల 24న మహిళను రోడ్డుపై అడ్డగించి ఇంట్లో ఎవరూ లేరని, రమ్మని బలవంతం చేశాడు. బాధితురాలు తీవ్రంగా ప్రతిఘటించి ఇంటికి వెళ్ళింది. సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది.