భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా దళిత సంఘాలు రేపల్లెలో ఆందోళన నిర్వహించారు. రేపల్లె పట్టణంలోని ప్రైవేట్ బ్యాంకులో పనిచేసే ఈశ్వర్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో అంబేద్కర్ పై అనుచితమైన పోస్టులు పెట్టాడు. పోస్టులపై ఆగ్రహం వ్యక్తం చేసిన దళిత యువకులు సోమవారం అర్ధరాత్రి ఈశ్వర్ పై మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు. ఈశ్వర్ ని తరలించే పోలీస్ వాహనం పై కూడా దాడి చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. తీవ్ర గాయాలైన ఈశ్వర్ ని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.