ప్రజల్లో వైసీపీ ప్రభుత్వం నమ్మకం కోల్పోయారని, అందుకే సోషల్ మీడియాపై ఆధారపడాలని ఎమ్మెల్యేలకు, మంత్రులకు హితబోధ చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత జగన్ రాజు ఎద్దేవా చేశారు. సోమవారం తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ప్రజా వ్యతిరేక విధానాలతో రోజురోజుకు జనం మద్దతు కోల్పోతున్న వైసిపి సర్కార్ గత ఎన్నికల్లో లాగా ఈ ఎన్నికల్లో కూడా సోషల్ మీడియాలో జిమ్మిక్కులు చేసి అధికారంలోకి రావాలని చూస్తోందని విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టబద్రులు వైకాపా అభ్యర్థులకు వాత పెట్టారని , అయితే మంత్రులు ఎమ్మెల్యేల సమావేశాల్లో ఈ గెలుపు చూసి తెలుగుదేశం బలుపు అనుకుంటుందని ముఖ్యమంత్రి మాట్లాడటం ఎన్నికల్లో ఓటు ద్వారా పాలక పక్షం పట్ల ఇచ్చిన తీర్పుకు కూడా ఓర్వలేక అహంతో మాట్లాడినట్లు కనిపిస్తోందన్నారు.