క్రెడిట్ కార్డు కస్టమర్లకు అలర్ట్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ మారిషస్‌కు చెందిన అనుబంధ సంస్థ ఎస్‌బీఎం ఇండియా బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని కమర్షియల్ క్రెడిట్ కార్డులను బ్లాక్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఎస్‌బీఎం బ్యాంక్ ఇండియా పలు ఫిన్‌టెక్ కంపెనీల భాగస్వామ్యం కుదుర్చుకొని వివిధ రకాల క్రెడిట్ కార్డులను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇప్పుడు అన్ని కమర్షియల్ క్రెడిట్ కార్డులను బ్లాక్ చేస్తున్నట్లు ప్రకటించడం గమనార్హం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకే ఎస్‌బీఎం బ్యాంక్ ఇండియా ఈ నిర్ణయం తీసుకున్నట్లు బ్యాంక్ ప్రతినిధులు తెలిపారు. నో యువర్ కస్టమర్ వివరాలు అప్డేట్ చేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.ఇప్పటి వరకు ఎవరైనా నో యువర్ కస్టమర్ వివరాలను అప్డేట్ చేయలేదో వారి కమర్షియల్ క్రెడిట్ కార్డులను బ్యాంక్ బ్లాక్ చేసింది. అంటే కేవైసీ అప్డేట్ చేసుకున్న తర్వాత మళ్లీ ఎస్‌బీఎం బ్యాంక్ ఇండియా క్రెడిట్ కార్డులు తిరిగి వాడుకునేలా పునరుద్ధరించే అవకాశాలు ఉన్నాయి. కేవైసీ చేసుకోనివారు ఇకపై కమర్షియల్ క్రెడిట్ కార్డులను వినియోగించుకోలేరు. మార్చి 31 అర్ధరాత్రి నుంచే క్రెడిట్ కార్డులను బ్లాక్ చేసే ప్రక్రియను బ్యాంక్ మొదలు పెట్టినట్లు సమాచారం. ఏప్రిల్ నెల నుంచి ఎవరైతే ఈ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉన్న వారు ఇకపై వాటి సేవలను పొందలేరు.క్రెడిట్ కార్డులను బ్లాక్ చేస్తున్న విషయాన్ని ఇప్పటికే కస్టమర్లకు అందజేసింది ఎస్‌బీఎం బ్యాంక్ ఇండియా. ఈ మేరకు ఇ-మెయిల్స్ పంపించినట్లు ఎస్‌బీఎం తెలిపింది.