ఢిల్లీ పర్యటనలో ఉన్న జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశమయ్యారు.ఈ సమావేశంలో జనసేన సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొన్నారు. అనంతరం నాదెండ్ల మనోహర్‌తో కలిసి పవన్ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. జనసేన-బీజేపీ తాజా రాజకీయాలు, ఉమ్మడి కార్యాచరణపై చర్చించినట్లు పవన్ తెలిపారు. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్‌ను చేయడమే జనసేన ఎజెండా అని, బీజేపీ ఎజెండా కూడా అదేనని వివరించారు. వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలకూడదన్నదే తన అభిమతమన్నారు.రాష్ట్రంలో చట్టపరమైన విధానాలు అమలు కావడం లేదు అని అన్నారు.బీజేపీ-జనసేన రెండు పార్టీలను సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని చెప్పారు. మరి కొన్ని చర్చల తర్వాతే సరైన సమయంలో పొత్తులపై నిర్ణయం వెల్లడిస్తానని పవన్ కళ్యాణ్ అన్నారు.