వివేకా హత్య కేసులో రోజుకో కీలక పరిణామం చోటు చేసుకొంటోంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ భాస్కర్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో ఏ4గా ఉన్న దస్తగిరిని అప్రూవర్ గా ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ ఆయన పిటిషన్ వేశారు. దస్తగిరి ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా తమపై నేరాన్ని మోపడం సరికాదని పిటిషన్ లో పేర్కొన్నారు. సీబీఐ అధికారులు చెప్పిన విధంగానే దస్తగిరి వాంగ్మూలం ఇస్తున్నాడని అన్నారు. వివేకా హత్య కేసులో దస్తగిరి కీలక పాత్ర పోషించాడని... అలాంటి వ్యక్తికి బెయిల్ ఇవ్వకూడదని అన్నారు. వివేకా హత్య కేసులో కీలకమైన ఆయుధాన్ని కొనుగోలు చేసింది కూడా దస్తగిరేనని చెప్పారు. ఆయన బెయిల్ విషయంలో కూడా సీబీఐ సహకరించిందని అన్నారు. దస్తగిరి బెయిల్ రద్దు చేయాలని కోరారు.