ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సంవత్సరం ఆరంభంలోనే అప్పులుపాలు కావడం శోచనీయమని కాంగ్రెస్ పార్టీ మీడియా ఇన్చార్జి తులసిరెడ్డి ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం అప్పులో ఊబిలో కూరుకుపోయిందన్నారు. పొరుగు దేశం శ్రీలంక తరహాలో ఆర్థిక సంక్షోభం దిశగా రాష్ట్రం పయనిస్తోందని, ఈ పరిస్థితి యమడేంజర్ అన్నారు. ఇటువంటి దుస్థితికి కారణం ముఖ్యమంత్రి జగనే అన్నారు. పరిసాలన చేతగాక పోవడంతో రాష్ట్రాన్ని అప్పులో ఊబిలోకి నెట్టారన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పింఛన్దారు లకు సకాలంలో జీతాలు అందకపోవడంతో వారందరూ జగన్ తీరును వ్యతిరేకిస్తున్నారన్నారు. ఇక నవరత్నాలు గులకరాళ్లు, నకిలీ రాళ్లుగా మారాయని ఎద్దేవా చేశారు.
2023 2024 ఆర్థిక సంవత్సరం మొదటి పనిదినం అయిన ఏప్రిల్ 3వ తేదీన వైకాపా ప్రభుత్వం 2000కోట్ల రూపాయలు అప్పు చేసింది. ఈ నాలుగు సంవ్సరాలలో జగన్ ప్రభుత్వం చేసిన అదనపు అప్పు7. 50లక్షల కోట్ల రూపాయలు. అయినప్పటికీ సకాలంలో ఉద్యోగులకి జీతాలు, విశ్రాంతి ఉద్యోగులకు పించన్లు, కాంట్రాక్టర్లకి పెండింగ్ బిల్లులు చెల్లించడం లేదని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో ఆర్థిక పరిస్థితి శ్రీలంక కంటే అధ్వాన్నంగా ఉందని వెల్లడించారు. ఇప్పటికైనా ఆర్థిక క్రమశిక్షనని పాటించాలని, అలవికాని అప్పులు చేయవద్దని జగన్ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ సూచిస్తున్నట్లు ఆయన తెలిపారు.