కడప స్థానిక మహావీర్ సర్కిల్లో ఉన్న భారతదేశ తొలి ఉప ప్రధాని "బాబు జగ్జీవన్ రామ్" గారి జయంతి సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్), సిపిఎం కడప జిల్లా కార్యదర్శి జి. చంద్రశేఖర్, సిపిఎం నగర కార్యదర్శి ఏ. రామమోహన్, సిపిఎం కడప నగర కమిటీ సభ్యులు చంద్రారెడ్డి, డి. ఎం. ఓబులేసు, పారుక్ హుస్సేన్ తదితరులు బాబు జగ్జీవన్ రామ్ గారి విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం కడప జిల్లా కార్యదర్శి జి. చంద్రశేఖర్ మాట్లాడుతూ స్వాతంత్రోద్యమంలో బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా ఉద్యమించిన దిశాలి బాబు జగజీవన్ రామ్ గారిని, స్వాతంత్రం వచ్చాక 8 దఫాలు పార్లమెంటు సభ్యుడిగా, కార్మిక శాఖ కేంద్ర క్యాబినెట్ మంత్రిగా, కేంద్ర హోం మంత్రిగా, దేశ ఉప ప్రధానిగా కీలకమైన బాధ్యతలు నిర్వహించినా సాధారణ కార్యకర్తలు తనకు ఉత్తరాలు రాస్తే ప్రత్యుత్తరం ఆయనే స్వయంగా రాసి పంపే వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా గుర్తింపు పొందిన వ్యక్తి అన్నారు. ఆయన జీవించిన కాలంలో కార్మికు వర్గ పక్షపాతిగా, సకల ప్రజల అభివృద్ధి కోరుకున్న వ్యక్తిగా నిలిచారని కొనియాడారు.