ఓ వ్యక్తి రైలులో ముగ్గురిపై పెట్రోల్ పోసి తగలబెట్టిన ఘటన ఇటీవల సంచలనం కలిగించింది. గత ఆదివారం రాత్రి కేరళలో కన్నూర్ ఎక్స్ప్రెస్లో ఒక చిన్నారితో సహా ముగ్గురు వ్యక్తులు ఈ అగ్నిప్రమాదంలో మరణించారు. కాగా ఈ ఘటనలో ఢిల్లీకి చెందిన 27 ఏళ్ల షారుక్ సైఫీ అనే వ్యక్తిని బుధవారం మహారాష్ట్రలోని రత్నగిరిలో మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అదుపులోకి తీసుకుని కేరళ పోలీసులకు అప్పగించింది.