శ్రీరామనవమి సందర్భంగా బీహార్‌లో ఇటీవల హింసాత్మక సంఘటనలు జరిగిన సంగతి తెలిసిందే. దీనిపై ఇవాళ అసెంబ్లీలో హైడ్రామా జరిగింది. ఈ నేపథ్యంలో సభలో గందరగోళం సృష్టిస్తున్నారని గుర్తించిన భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే జీవేష్ మిశ్రాను మార్షల్స్ సభ నుంచి బయటకు లాక్కెళ్లారు. ‘స్పీకర్ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు. నన్ను అసెంబ్లీ నుంచి బయటకు పంపించారు. ప్రజాస్వామ్యం నేడు మసకబారుతోంది' అని మిశ్రా వ్యాఖ్యానించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa