పరువునష్టందావా కొటివేయడంతోఅమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు స్వల్ప ఊరట లభించింది. కోర్టు కేసులు, నేరాభియోగాలు, అరెస్టులతో సతమతమవుతున్న ట్రంప్ ఓ తీర్పుతో కాస్త ఉపశమనం పొందారు. పోర్న్ స్టార్ స్టోర్మీ డేనియల్స్ వేసిన పరువు నష్టం దావాను కోర్టు కొట్టేసింది. ఈ కేసులో లీగల్ ఖర్చుల కింద 1,21,000 డాలర్ల (సుమారు రూ.కోటి) ను ట్రంప్ కు చెల్లించాలని డేనియల్స్ ను ఆదేశించింది. ఈమేరకు కాలిఫోర్నియా కోర్టు బుధవారం డేనియల్స్ దాఖలు చేసిన పరువునష్టం దావాను తోసిపుచ్చింది. ఈ కేసుతో పాటు మరో కేసుకు సంబంధించి 5 లక్షల డాలర్లను ట్రంప్ కు డేనియల్స్ చెల్లించాల్సి ఉంది.
డొనాల్డ్ ట్రంప్ తనతో సన్నిహితంగా మెలిగారని, ఆ బంధం గురించి బయటకు చెప్పకుండా ఉండేందుకు 1.30 లక్షల డాలర్లు ముట్టజెప్పాడని స్టోర్మీ డేనియల్స్ ఆరోపించింది. 2018లో తమ బంధం గురించి బయటపెట్టడంతో తనకు బెదిరింపులు వచ్చాయని డేనియల్స్ పేర్కొంది. ఈ విషయంలో నోరు మెదప వద్దని ఓ వ్యక్తి తనను బెదిరించాడని డేనియల్స్ ఆరోపించింది. అయితే, ఈ ఆరోపణలను ట్రంప్ కొట్టిపారేశారు. డేనియల్స్ మాటలను కట్టుకథలుగా విమర్శించాడు. ఈ కామెంట్లపై మండిపడ్డ డేనియల్స్.. ట్రంప్ పై పరువునష్టం దావా వేసింది. తాజాగా ఈ దావాను కాలిఫోర్నియా కోర్టు కొట్టేసింది. ఈ కేసుకు సంబంధించి ట్రంప్ కు అయిన లీగల్ ఖర్చులు భరించాలని డేనియల్స్ ను ఆదేశించింది.