గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మరింత మెరుగైన వైద్యం అందించేందుకు ఏపీ ప్రభుత్వం ఇవాళ మరో సంక్షేమ పథకాన్ని ప్రారంభించనుంది. పల్నాడుజిల్లా లింగంగుట్లలో సీఎం జగన్ ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని ప్రారంభిస్తారు. గ్రామాల్లో స్పెషలిస్టు డాక్టర్లతో వైద్య, ఆరోగ్య సేవలు అందిస్తూ ప్రభుత్వం పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టిన ఈ ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్నారు. దీంతో ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు గ్రామాల్లో డాక్టర్ అందుబాటులో ఉంటారు.