హరియాణాలో దారుణం జరిగింది. సోనిపత్‌లో పెళ్లై ఇద్దరు పిల్లలున్న సునీల్ అనే వ్యక్తి మోనిక(23)తో సంబంధం పెట్టుకున్నాడు. కొద్దిరోజులకు ఉన్నత చదువుల కోసం మోనిక కెనడా వెళ్లగా ఆమెను ఇండియా రప్పించి 2022 మేలో పెళ్లి చేసుకున్నాడు. మోనికను తన ఫామ్‌హౌస్‌కు తీసుకెళ్లగా, అక్కడ వారిద్దరి మధ్య గొడవ జరగటంతో తుపాకీతో ఆమెను కాల్చి చంపేశాడు. తర్వాత మృతదేహాన్ని పాతిపెట్టాడు. తాజాగా నిజాలు రాబట్టిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.