పోలవరం కోసం ఎంతోమంది తమ భూములను త్యాగం చేశారని, నిర్వాసితులకు న్యాయం చేయాల్సిన బాధ్యత పాలకులపై ఉందని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.... తాను వెళ్లిన సమయంలో అక్కడ ప్రజలు ధర్నా చేస్తున్నారని, వాళ్ల ఇబ్బందులు తెలుసుకుని వారికి డబ్బులు ఇచ్చామన్నారు. రెండోసారి కూడా చంద్రబాబు రూ. 130 కోట్లు ఇచ్చారని, వారికి పక్కా ఇళ్లు కట్టించేలా చర్యలు చేపట్టామన్నారు. డయా ఫ్రం వాల్ కోసం 300 అడుగులు కిందకి వెళ్లామని తెలిపారు. ముంపు గ్రామాల ప్రజల సహకారం వల్లే తాము పురోగతి సాధించామని దేవినేని ఉమ అన్నారు.