వరంగల్లోని జాతీయ స్థాయి విద్యాసంస్థ ఎన్ఐటీ (నిట్)లో స్ప్రింగ్ స్ప్రీ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి హీరో పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. తాను సాధారణంగా విద్యాసంస్థల కార్యక్రమాలకు వెళ్లనని అన్నారు. తన చిన్నతనంలో లియోనార్డో డావిన్సీ తనకు రోల్ మోడల్ అని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఇంటర్ పరీక్షల సమయంలో తన స్నేహితులు చిట్టీలు తీసుకెళ్లేవారని అన్నారు. ఒకవేళ ఫెయిల్ అయినా కాపీయింగ్ కొట్టకూడదని తాను భావించేవాడినని వివరించారు. ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అయ్యానని, అయితే నైతికంగా విజయం సాధించానని పేర్కొన్నాడు. ఎంతో దూరదృష్టితో ఎన్ఐటీలను ప్రారంభించినందుకు నెహ్రూ కీర్తించారు. విద్యార్థులు తమ సామర్థ్యానికి తగ్గ ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించారు. పరాజయాలను ఎదుర్కొంటేనే విజయం సాధ్యమవుతుందన్నారు. ఈరోజు నేను విఫలం కావచ్చు... రేపు విజయం సాధిస్తాను అని అన్నారు.