ఏపీలో 1.60 కోట్ల కుటుంబాలను నేరుగా కలుసుకునే ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమానికి నేటి నుంచి ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. గత నాలుగేళ్లుగా ప్రభుత్వ కార్యక్రమాలు, వైసీపీ ప్రభుత్వం చేపట్టిన వాటి గురించి ప్రతి ఇంటికీ వెళ్లి వివరిస్తారు. ఏపీలోని కోటి 60 లక్షల ఇళ్లను 7 లక్షల మంది గృహసారథులు సందర్శిస్తారు. యజమాని మద్దతుతో వారి ఇంటి తలుపు, మొబైల్ ఫోన్కు సీఎం జగన్ ఫోటోను అతికిస్తారు.