వయోవృద్ధులు, దివ్యాంగులు, మంచానికే పరిమితమైన రోగపీడితులకు తమ ఇంటి వద్దే ఆధార్ నమోదు చేయనున్నారు. ఈ మేరకు కేంద్రం రాష్ట్రాలకు మార్గదర్శకాలను పంపింది. వీరంతా తమ సమాచారాన్ని ఈ–మెయిల్ ద్వారా UIDAIకి పంపితే 7 రోజుల్లోగా, వారి ఇంటికే వెళ్లి ఆధార్ నమోదు చేస్తారు. ఒకే అడ్రెస్ ఉన్న ఇంటిలో మొదటి వ్యక్తికి రూ.700, ఆ తర్వాత ఎంత మంది ఉన్నా ప్రతి ఒక్కరికి రూ.350 చొప్పున వసూలు చేస్తారు.