గుంటూరు: పలు రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ నెల 10, 11 తేదీలలో గుంటూరు జీజీహెచ్ హాస్పిటల్ తో పాటు, పలు ప్రభుత్వ ఆసుపత్రులలో కోవిడ్ మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నట్లు డీఎంహెచ్‌వో అమర్తలూరి శ్రావణ్ బాబు గురువారం తెలిపారు. ఆయా ఆస్పత్రుల్లో కరోనా ఏర్పాటుకు సంబంధించి మాక్ డ్రిల్‌లో భాగంగా పలువురు ఉన్నతాధికారులు పాల్గొంటారని వెల్లడించారు.