పల్నాడు జిల్లా, దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలో అంజనాపురంలోని ఇదేం కర్మ మన రాష్ట్రానికి-ఇదేం కర్మ మన గురజాలకి కార్యక్రమాన్ని గురువారం రాత్రి గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు నిర్వహించారు. అంజనాపురంలో ప్రతి ఇంటికి వెళ్లి ఈ వైసీపీ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా యరపతినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ. ఈ వైసీపీ ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలు తీసుకుని, ఎన్నో అరాచకాలను సృష్టిస్తుందని ఈ వైసిపి ప్రభుత్వం పోవాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. అదేవిధంగా పల్నాడులో గురజాల, మాచర్ల నియోజకవర్గాల్లో టిడిపి గెలవాల్సిన అవసరం ఉందని అన్నారు. రాబోయే ఎన్నికల్లో టిడిపి గెలిపించాలని కోరారు.