రానున్న ఎన్నికల్లో కూడా మళ్లీ ముఖ్యమంత్రిగా జగనన్నని గెలిపించుకోవడం మనందరి భాధ్యత అని వంగర వైసీపీ నాయకులు అన్నారు. గురువారం వంగర మండల పరిధిలోని మడ్డువలస, మద్దివలస సీతారాంపురం, సంగాం, రుషింగి గ్రామాల్లో ‘మా నమ్మకం నువ్వే జగన్’ సమావేశంలో వారు మాట్లాడారు. పార్టీ తరఫున సచివాలయ కన్వీనర్లతో పాటు, గృహసారథులు తొలిసారి ఒక భారీ పార్టీ కార్యక్రమంతో ఈనెల 7 నుంచి 14 రోజుల పాటు ప్రజలతో మమేకం కావడానికి ప్రత్యేక కార్యక్రమానికి రూపకల్పన చేస్తామన్నారు. ఒక రాజకీయ పార్టీ కార్యకర్తలుగానే కాకుండా ప్రజల అవసరాలను గుర్తించి. వాటిని తీర్చే బాధ్యతగల పౌరులుగా పని చేస్తారని తెలిపారు. ప్రభుత్వం పనితీరుపై పార్టీ పట్ల ప్రజల అభిప్రాయాన్ని, సంతృప్తిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటారన్నారు. ప్రజల నుంచి వచ్చిన ప్రధానమైన నినాదం ‘మా నమ్మకం నువ్వే జగన్’. అందుకే ఈ నినాదాన్ని కూడా ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమంలో ఒక ప్రధాన అంశంగా పెట్టామన్నారు. ఈ నినాదమనేది తమకు తాముగా అనుకున్నది కాదన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.