"మానమ్మకం నువ్వే జగన్" అనే నినాదంతో మనం ఇంటింటి ప్రచారం నిర్వహించాలని రాజాం నియోజకవర్గ ఎమ్మెల్యే కంబాల జోగులు పిలుపునిచ్చారు. మన రాజాం అసెంబ్లీ నియోజకవర్గంలో నాలుగు మండలాలు, ఒక మున్సిపల్ కార్పొరేషన్ కూడా ఒకేసారి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని కోరుతున్నానని గురువారం సాయంత్రం ఒక ప్రకటన విడుదల చేసారు. సచివాలయ కన్వీనర్లు, గృహసారధులు, వాలంటీర్లు ఒక టీమ్ గా ఏర్పడి స్థానిక నేతలను కూడా కలుపుకొని ప్రతి ఇంటికీ వెళ్ళి జగనన్న ప్రజలకు అందిస్తున్న పధకాలను వివరించి, వారికి కరపత్రాలను పంచి, వారి అనుమతితో సెల్ ఫోన్ మరియు డోర్ స్టిక్కర్లను అతికించాలన్నారు. అనంతరం వారి సెల్ఫోన్ నుంచే 82960 82960 అనే నంబర్ కు మిస్సుడ్ కాల్ ఇప్పించాలి. ఈ పద్దతిలో ఈ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు.