విజయనగరం జిల్లా కలెక్టర్ గా నాగలక్ష్మి నియమితులయ్యారు. ఈమె 2012 ఐఏఎస్ బ్యాచ్ కి చెందిన అత్యున్నత విద్యావంతురాలు. బిట్స్ ఫిలానీలో బీఈ (ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్) 2006-10 బ్యాచ్లో చేశారు. 2015-17 వరకు గుంటూరు కార్పొరేషన్ కమిషనర్ గా చేశారు. 2017-19 వరకు ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ గా చేశారు. 2019లో ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఎలక్షన్ అబ్జర్వ్ గా బాధ్యతలు నిర్వర్తించారు. 2019-21 వరకు విశాఖలో ఏపీ ఈపీడీసీఏల్ ఛైర్పర్సన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా పని చేశారు. 2021 నుంచి ప్రస్తుతం వరకు అనంతపురం కలెక్టర్ గా ఉన్నారు. ఆ సమయంలోనే 2019 ఐఏఎస్ బ్యాచ్ కి చెందిన ఐఏఎస్ అధికారి నవీన్‌కుమార్, కలెక్టర్ నాగలక్ష్మి వివాహ బంధంతో ఒక్కటయ్యారు.
నవీన్ కుమార్ ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా జాయింట్ కలెక్టర్‌గా పనిచేస్తున్నారు. కలెక్టర్ నాగలక్ష్మి పాలనలో చాలా చురుకుగా, ముక్కు సూటిగా ఉంటారనేది నిర్వివాదాంశం. తెలుగు స్పష్టంగా మాట్లాడుతారు. ఎన్నికల నిర్వహణపై విజయనగరం జిల్లాకు సంబంధించి అవగాహన కలిగి ఉన్న కలెక్టర్ నాగలక్ష్మి, ప్రభుత్వ అంచనాలకు తగ్గట్టుగానే త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నిర్వహణపైనే ఆమె ప్రధానంగా ఫోకస్ పెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.