సీఎం జగన్ పై టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు రెచ్చిపోయారు. వైసీపీలో ఎమ్మెల్యేలకు కనీస విలువ కూడా లేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్ నైజం అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు ఎంత బుజ్జగిస్తున్నా వైసీపీ ఎమ్మెల్యేలెవరూ నమ్మే పరిస్థితిలో లేరు. టీడీపీలో చేరుతామని మా పార్టీ నాయకులను సంప్రదిస్తున్నారు’’ అని అచ్చెన్నాయుడు అన్నారు. 40 మంది వైసీపీ ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారని ఇటీవల హైదరాబాద్లో చెప్పానని, ఆ పార్టీ ఎమ్మెల్యేలందరూ టీడీపీలో చేరేందుకు క్యూ కడుతున్నారని చెప్పారు. ‘నలుగురు వస్తాం.. మాలో ఒకరికి టికెట్ ఇస్తే చాలు’ అని నేరుగా తనకే బంపర్ ఆఫర్ ఇచ్చారని తెలిపారు. జీవితాంతం వైసీపీలోనే ఉంటామని చెబుతున్న వారే తమ పార్టీలోకి రావడానికి ముందు వరుసలో ఉన్నారన్నారు. ‘‘వైసీపీ ఒకేసారి కుప్పకూలింది. అక్కడ టికెట్లు తెచ్చుకున్నా గెలిచే పరిస్థితి లేదు. అందుకే ముందే తప్పుకోవాలని ఆ పార్టీ ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. మాతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభుత్వ సలహాదారు సజ్జల ఫెయిల్ అయ్యారు అని ఆయన తెలియజేసారు .