తమిళనాడు తెంకాసి జిల్లా శంకరన్ కోవిల్ లోని భద్రకాళి ఆలయంలోకి వెళ్లకుండా ఓ వర్గం వారిని పోలీసులు అడ్డుకోవడం కలకలం రేపింది. ఇరువర్గాల మధ్య ఆలయ ప్రవేశంపై కొన్నేళ్లుగా ఘర్షణ జరుగుతుండగా అందరికీ ఆలయ ప్రవేశం ఉంటుందని తాజాగా హైకోర్టు తీర్పిచ్చింది. దీంతో ఉత్సవాల్లో పాల్గొనేందుకు వీరనాపురం గ్రామస్థులు రాగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో వివాదం నెలకొంది. దీనిపై వివరణ ఇవ్వాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.