కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బెయిల్ తీసుకోలేక జైళ్లలో ఉన్న పేద ఖైదీలకు ఆర్థిక సాయం అందించేందుకు ఓ పథకం ప్రారంభించనుంది. ఈ పథకంతో జైళ్లలో రద్దీ తగ్గుతుందని భావిస్తోంది. చదువు, ఆదాయం లేని అట్టడుగు వర్గాల ఖైదీలు జైలు నుండి బయటకు రావడానికి ఈ పథకం ఉపయోగపడుతుందని కేంద్ర హోంశాఖ వెల్లడించింది. అలాగే లీగర్ సర్వీసెస్ అథారిటీ ద్వారా ఖైదీలకు ఉచిత న్యాయ సేవలు అందిస్తామని తెలిపింది.