మరికొద్ది రోజుల్లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. దీంతో రాజకీయ నేతలు ఒకరిపై ఒకరు విమర్శల జోరు పెంచారు. తాజాగా సీఎం బసవరాజ్ బొమ్మై కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ఆ పార్టీకి 60 స్థానాలలో పోటీ చేసేందుకు అభ్యర్థులే లేరని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ గత ఎన్నికల్లో కంటే ఘోరంగా ఓడిపోతుందని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ ఎట్టిపరిస్థితుల్లోనూ అధికారంలోకి రాదన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa