ప్రజలు వడదెబ్బ పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ వైద్యాధికారి జస్వంత్ రాయల్ శనివారం తెలిపారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏప్రిల్, మే నెలల్లో ఎండలు ఎక్కువగా ఉంటాయన్నారు. వేసవిలో వడదెబ్బకు గురికాకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎక్కువగా నీరు తాగాలని, బయటకు వెళ్లే సమయంలో గొడుగు తప్పనిసరిగా ఉపయోగించాలన్నారు. వాతావరణ పరిస్థితులను బట్టి కొబ్బరి నీళ్లు తాగాలని ఏదైనా అనారోగ్య సమస్య వచ్చిన వెంటనే స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు రావాలన్నారు.