మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని పుంగనూరు నియోజకవర్గం సోమల ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య వైద్య అధికారి శివప్రతాప్ తెలిపారు. సోమల మండల కేంద్రంలో శుక్రవారం పీహెచ్ సీ ఆధ్వర్యంలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవంపై ర్యాలీ నిర్వహించారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా జీవించాలంటే సైక్లింగ్, జిమ్ యోగ , నడక తప్పనిసరి అన్నారు. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలన్నారు.