అల్లూరి సీతారామరాజు జిల్లా వాకపల్లిలో 13 మంది గిరిజన మహిళలపై పోలీసు వారు అత్యాచారానికి ఘటనలో దోషులను నిర్దోషులుగా కోర్టు పరిగణించడం బాధాకరంగా ఉందని రాష్ట్ర రెల్లి హక్కుల రిజర్వేషన్ పోరాట సమితి జిల్లా అధ్యక్షులు యర్రంశెట్టి పాపారావు అభిప్రాయపడ్డారు. ఈ మేరకు నర్సీపట్నంలో శుక్రవారం ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ ఎస్టీ కేసులో విచారణ అధికారి తీసుకున్న తప్పుడు నిర్ణయం వల్ల దోషులు నిర్దోషులుగా విడుదలయ్యారని పేర్కొన్నారు.