వినూత్న పాలనతో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ, ప్రజలకు ఆరాధ్య దైవంగా ఉన్న సీఎం శ్రీ వైయస్ జగన్పై, విపక్షనేత చంద్రబాబు పిచ్చి విమర్శలు చేస్తున్నారు అని మంత్రి కాకాణి గోవెర్దన్ రెడ్డి అసహనం వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ... నోటికి ఎంత వస్తే, అంత మాట్లాడుతున్నారు. నిజానికి చంద్రబాబే రాష్ట్రానికి అరిష్టం. దేశానికి దరిద్రం. ఆయన కరువుకు బ్రాండ్ అంబాసిడర్. ఇది రాష్ట్రంలో ఎవరికి అడిగినా చెబుతారు. ఆయన పాలనంతా కరువు కాటకాలే అని ఎద్దేవా చేసారు.