విశాఖలో మళ్లీ కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. శుక్రవారం 142 మందికి పరీక్షలు చేయగా 12 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఒక్కసారిగా విశాఖలో భయాందోళనలు నెలకున్నాయి. విశాఖలో పూర్తిగా కరోనా సమసిపోయిందని భావిస్తున్న తరుణంలో మళ్లీ 12 కేసులు ఒకే రోజు నమోదవడంతో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. దీంతో ఈ నెల 10, 11 తేదీలో మాక్ డ్రిల్ నిర్వహించేందుకు వైద్య శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, కోవిడ్ నిబంధనలు పాటించాలని డీఎంఅండ్ హెచ్‌వో జగదీశ్వరరావు కోరారు.