నేటి నుంచి జరుగుతున్న జగనన్నే మా నమ్మకం అనే కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా లక్షలాదిమంది ప్రజలు ఎదురుచూస్తున్నారని నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ శుక్రవారం తెలిపారు. ఆయన నర్సీపట్నం తన క్యాంపు కార్యాలయంలో మాట్లాడుతూ గృహసారధులు కన్వీనర్లతో సమన్వయంతో ఇంటింటికి వెళ్లి గత ప్రభుత్వానికి వైసీపీ ప్రభుత్వానికి మధ్య తేడాను ప్రజలకు వివరిస్తారని తెలిపారు.