సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ రైలును ప్రారంభించినందుకు ప్రధాని మోదీకి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని వెల్లడించారు. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న డిమాండ్ ఇవాళ నెరవేరిందని, ఈ రైలు అంశాన్ని వైసీపీ ఎంపీలు పార్లమెంటులో చాలా రోజులుగా ప్రస్తావిస్తూనే ఉన్నారని విజయసాయిరెడ్డి వివరించారు.
తిరుపతి యాత్రికులకు ఈ వందేభారత్ రైలు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం సికింద్రాబాద్-తిరుపతి మధ్య ప్రయాణ సమయం 12 గంటలు కాగా, ఈ రైలుతో అది ఎనిమిదిన్నర గంటలకు తగ్గిపోతుందని, ఆర్థికాభివృద్ధికి ఇది ఎంతగానో తోడ్పడే అంశమని పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa