పేద ప్రజల ప్రత్యక్షదైవం, పేదల గుండె చప్పుడు, పేదల ఆశాజ్యోతి, ప్రజా సేవకులకే తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప మహాణీయుడు అయిన ఫాదర్ ఫెర్రర్ 104వ జయంతోత్సవం. ఈ మహాణీయుడు స్పెయిన్ దేశంలోని బార్సిలోనాలో 1920వ సంవత్సరం ఏప్రిల్ 9వ తేది జన్మించి, భారతదేశంలోని ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోనే కరువు జిల్లాగా పేరు ప్రఖ్యాతులు గాంచిన అనంతపురం జిల్లాలో 2009వ సంవత్సరం జూన్ 19వ తేది స్వర్గస్తులయ్యారు. దేశం కాని దేశస్తుడు గత 50 దశాబ్దాల క్రితం కరువు జిల్లా అయిన అనంతపురం మనకు విచ్చేసి ఎస్సీ, ఎస్టీ, బిసి అణగారిన వర్గాలకు చెందిన ప్రజలకు నేనున్నా మీ జీవితాలకు అండగా అంటూ విద్య పరంగా, వైద్యపరంగా, జీవన స్థితిగతుల పరంగా, భూగర్భజలాల పెంపుపరంగా ఇలా అనేక రకాలుగా, అనేక విధాలుగా సేవలందించి చైతన్యం పెంపొందించారు. ఆ మహానుభావుడు అనంతపురం జిల్లాకు రాకపోయి ఉండి ఉంటే దుర్భరమైన జీవితాన్ని, బానిస బతుకు జీవితాన్ని గడపాల్సి ఉండేది పేద ప్రజానీకం. ఈ సందర్భంగా అనంతపురం జిల్లాకు ఆ మహానుభావుడు అందించిన సేవలను స్మరించుకుంటూ ప్రతి ఒక్క పౌరుడు ఘన నివాళిని అర్పించాలి.