కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వందే భారత్ ఎక్స్ ప్రెస్ కు శనివారం గుంటూరు స్టేషన్ లో ఘన స్వాగతం లభించింది. వివిధ సంస్థల నుంచి వచ్చిన చిన్నారులు వందే భారత్ రైలును వీక్షించేందుకు ఆసక్తి చూపించారు. ఈ సందర్భంగా చిన్నారులు మాట్లాడుతూ ఇలాంటి రైళ్లను చూడాలంటే విదేశాలలోని చూడాల్సి ఉంటుంది. గుంటూరు ప్రజలకు సౌకర్యం లభించింది. ఇలాంటి సౌకర్యం కల్పించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కీ చిన్నారులు కృతజ్ఞతలు తెలిపారు.