రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్న నిత్యవసర ధరల నియంత్రణ కు ప్రభుత్వమే బాధ్యత వహించాలని మాజీ ఎమ్మెల్యే , సంగండెయిరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ అన్నారు. శనివారం పొన్నూరు మండలం మామిళ్ళపల్లి గ్రామంలో తెదేపా నాయకులతో కలిసి గ్రామలో తేదేపా నాయకులను కలుసుకొని పరామర్శించి అనంతరం గ్రామంలో రోడ్ షో నిర్వహించి మాట్లాడారు. రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం ముందు ధరలు, తరువాత ధరలను ఒకసారి పరిశీలించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నిత్యవసర ధరలతో పాటు పన్నుల భారం అధికమైందని పేర్కొన్నారు. ప్రజలు తెలుగుదేశం పార్టీకి మద్దతు పలకాలని ఆయన కోరారు. కార్యక్రమంలో గ్రామ తెదేపా నాయకులు పాల్గొన్నారు.