పూరి జగన్నాథ వడ్డి పండా కులస్తులకు కుల ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయాలని ఆ సంఘం సభ్యులు కోరారు. నరసన్నపేటలో ఆదివారం ఆ కుల సంఘం జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన మందస, పాతపట్నం, ఇచ్ఛాపురం, సొంపేట తదితర మండలాల నుంచి పలువురు సమావేశానికి హాజరయ్యారు. ఇంటిపేరు కులం పేరుగా ఉన్నందున కుల ధ్రువీకరణ పత్రం మంజూరు కాక ప్రభుత్వం అందించే పలు సంక్షేమ పథకాలు అందడం లేదన్నారు. కుల ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయాలన్నారు. అనంతరం సంఘం సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా సంఘం గౌరవ అధ్యక్షుడిగా పండిత వెంకటేశ్వర పాణిగ్రహి, అధ్యక్షుడిగా పండిత గోవిందరావు, ఉపాధ్యక్షుడిగా పండిత రాంబాబు, కార్యదర్శిగా ఎం. జి. ఎస్. రామచంద్రరావు ఎన్నుకున్నారు.