యోగాతో రోగం దూరమవుతుందని అందుచేత ప్రతినిత్యం యోగా సాధనకు అలవాటు పడాలని వక్తలు కొనియాడారు. రిటైర్డ్ జిల్లా జడ్జి పప్పల జగన్నాధరావు, గురువులు ఎంవీ రామారావు, మావూరు నాగేశ్వరరావు యోగావలన పొందే ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. పిఎన్ కాలనీ పార్కులో ఆదివారం కేవలం మహిళలకు యోగా శిక్షణ కేంద్రం ఏర్పాటు చేశారు. అనంతరం వారు మాట్లాడుతు ప్రతిరోజు తన దైనందిక కార్యక్రమంలో యోగాసనాలు చేర్చుకోవాలన్నారు. యోగా చేస్తు ఆయుర్వేదికం అంటే వంటిల్లులో లభించే దినుసులు వినియోగం సర్వరోగాలకు నివారణగా తోడ్పడుతుందని వివరించారు. కాలనీకి చెందిన పిల్లలు పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రతిరోజు సాయంత్రం అయిదు గంటలకు కరీటూరి నాగలక్ష్మి యోగాసనాలు నేర్పుతారన్నారు. అందుచేత ఈ ప్రాంతీయులు వినియోగించుకోని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మారాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో యోగా శిక్షకులు ఎస్. సుధారాణి, జి. లక్ష్మీశంకర్, దేవలక్ష్మీతో పాటు పలువురు పాల్గొన్నారు.