విద్యుత్ ఛార్జీల పెంపుకు నిరసనగా నేడు సోమవారం టిడిపి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ విజయవంతం చేయాలని మండల టిడిపి అధ్యక్షులు నూకరాజు మరియు ఆముదాల వలస పట్టణ టిడిపి అధ్యక్షులు ఎస్ మురళి ప్రకటన విడుదల చేశారు. ఆదివారం రాత్రి విడుదల చేసిన ప్రకటనలో రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల పెంపుకు నిరసనగా ర్యాలీ చేపడుతుందని దీన్ని టిడిపి శ్రేణులు విజయవంతం చేయాలని ప్రకటనలో కోరారు. ఈ ర్యాలీలో జిల్లా టిడిపి పార్లమెంటరీ అధ్యక్షులు కూన రవికుమార్ పాల్గొంటారని, టిడిపి పార్టీ సర్పంచులు ఎంపీటీసీలు వివిధ స్థాయిలో ఉన్న నాయకులు కార్యక్రమాలు విజయవంతం చేయాలని సూచించారు.