కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ నిర్దోషి ఆయనకు జైలు శిక్ష కక్షపూరితచర్యలని పేర్కొంటూ రాహుల్కు మద్దతుగా పోస్టుకార్డు ఉద్యమం చేపడుతున్నట్టు కాంగ్రెస్ పార్టీ నరసన్నపేట నియోజకవర్గ ఇన్చార్జి దుప్పట్ల మధుసూదన రావు (మధు) అన్నారు. ఆదివారం పోలాకి మండలం తలసముద్రం గ్రామంలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాహుల్ గాంధీ కుటుంబంపై కక్షసాధింపు చర్యలు చేపడుతోందని విమర్శించారు. రాహుల్ ప్రశ్నలకు జవాబు చెప్పలేక ఇటువంటి చర్యలకు పాల్పడుతోందన్నారు. ఈనెలాఖరు నాటికి పోలాకి మండల కేంద్రంలో పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తున్నామని, అభిమానులు తరలిరావాలని కోరారు.