వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా పంటలపై పురుగు మందులు పిచికారీ చేయడానికి మొదటి విడతగా విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలకు 40 డ్రోన్లు రానున్నాయి. జిల్లాకు 20 చొప్పున ప్రభుత్వం వీటిని సమకూర్చనుంది. నిరుద్యోగులైన యువతను డ్రోన్ పైలెటింగ్ శిక్షణ కోసం ఎంపిక చేయాలని వ్యవసాయ శాఖ కమిషనర్ /డైరెక్టర్ కార్యాలయం నుంచి జిల్లా వ్యవసాయ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఒక్కో డ్రోన్ విలువ సుమారు రూ. 10లక్షలు ఉంటుంది.