నేడు పోలవరం బ్యాక్ వాటర్ అంశంపై కీలక భేటీ జరగనుంది. ఈ అంశంపై తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల అనుమానాలను నివృత్తి చేసేందుకు నేడు కేంద్ర జలశక్తి శాఖ ఢీల్లీలో ఈ సమావేశాన్ని నిర్వహిస్తోంది. ఏపీతో పాటు ఆయా రాష్ట్రాల అధికారులు ఈ భేటీలో పాల్గొననున్నారు. ఈ సమావేశంలో వెల్లడయ్యే అంశాల ఆధారంగా నివేదిక తయారుచేసి కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ కు అందజేయనున్నారు.